99TV News

    ‘రామాయణం’ డబ్బింగ్‌పై క్లారిటీ ఇచ్చిన నితేశ్ తివారీ | Ramayana AI Dubbing Issue

    ‘రామాయణం’ డబ్బింగ్‌పై క్లారిటీ ఇచ్చిన నితేశ్ తివారీ | Ramayana AI Dubbing Issue

    రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ (Ramayana) నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా డబ్బింగ్‌ ప్రక్రియలో ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు నితేశ్ తివారీ చెక్ పెట్టారు. లాస్‌ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో నిర్వహించిన గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

    "డబ్బింగ్‌ ఆర్టిస్టుల గొంతులే వాడాం"

    వివిధ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మాతృభాషలో సహజంగా వీక్షించేందుకు సాంకేతికత తోడ్పడుతుందని నితేశ్ తివారీ తెలిపారు. "సినిమాలోని పాత్రల డబ్బింగ్‌ వాయిస్‌లను నిజమైన డబ్బింగ్‌ ఆర్టిస్టులే అందించారు. డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించలేదు. కేవలం సంభాషణలు పలికేటప్పుడు పెదవుల కదలికలు (Lip movements) ఆయా భాషల మాటలకు సరిగ్గా మ్యాచ్ అవ్వడం కోసం మాత్రమే 'బ్రహ్మ ఏఐ' (Brahma AI) టెక్నాలజీ సాయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టత ఇచ్చారు.

    Also Read - 30 ఏళ్ల వయసులో 50 ఏళ్ల మహిళగా.. అద్దంలో చూసుకుని గుర్తుపట్టలేకపోయా: వామికా గబ్బీ!

    నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల

    భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ దేవోల్‌ హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా, దిగ్గజ సంగీత దర్శకులు హన్స్ జిమ్మర్‌, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో సంగీతం రూపుదిద్దుకుంది. నవంబర్‌ 5న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది.