హైదరాబాద్:
యువ కథానాయకుడు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తోంది. సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘రుక్కు రుక్కు రుక్మిణి’ సాంగ్ ఆకట్టుకునేలా..
ఈ సినిమా డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేస్తూ మంగళవారం ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని విడుదల చేసింది. ‘‘రుక్కు రుక్కు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి’’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు విజయ్ బుల్గానిన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, పూర్ణాచారి ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు.
Also Read - 25 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చాలా ఆనందంగా ఉంది: ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌లో వెంకటేష్!
ఆకట్టుకుంటున్న నితిన్ స్టెప్పులు
పాటలో హీరో నితిన్ వేసిన హుషారైన డ్యాన్స్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కథానాయిక ఆఫియా సయ్యద్ ఈ పాటలో టీచర్ గెటప్‌లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ఓ వినూత్నమైన కథతో, చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జోమోన్ టీ జాన్ ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) అందిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
