99TV News

    Salman Khan Comments on Ranbir Kapoor Ramayana Movie Budget | Nitesh Tiwari

    Salman Khan Comments on Ranbir Kapoor Ramayana Movie Budget | Nitesh Tiwari

    రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’పై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా బడ్జెట్, వీఎఫ్‌ఎక్స్ గురించి కాకుండా రామాయణంలోని పాత్రలు, వాటి గొప్పతనం గురించి చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

    దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ను రెండు భాగాలుగా రూపొందించేందుకు సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా కథ కంటే బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన తాజా చిత్రం ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌.. ‘రామాయణ’ సినిమా గురించి స్పందించారు.

    ‘‘‘రామాయణ’ గురించి చర్చ జరగాలంటే అది రామాయణం కథ, అంతర్నిహిత సందేశం గురించి మాత్రమే అయి ఉండాలి. సినిమాలో ఉపయోగించిన వీఎఫ్‌ఎక్స్, నిర్మాణ వ్యయం గురించి కాదు..! రూ.4 వేల కోట్ల బడ్జెట్ అంటూ పదేపదే మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. సినిమా గురించి మాట్లాడేటప్పుడు శ్రీరాముడు, రావణుడు, సీతాదేవి పాత్రల గురించి మాట్లాడాలి. మన పురాణ గ్రంథాల్లో ఉన్న విషయాలు, ఆ పాత్రల గొప్పతనం గురించి చర్చించాలి. રાముడి వ్యక్తిత్వం, ఆయనలోని సుగుణాలను ప్రజలకు తెలియజేయాలి. శ్రీరాముడు ఎంతో గొప్పవాడు. ఉత్తమ భర్త, కుమారుడు, సోదరుడు మరియు గొప్ప యోధుడు. నేను నటించిన ‘మాతృభూమి’ సినిమాలోని నా పాత్రలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి’’ అని సల్మాన్ ఖాన్ వివరించారు.