99TV News

    సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే?

    సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే?

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గతంలో ఈ సినిమాను ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో తెరకెక్కించారు. అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు చిత్ర టైటిల్‌ను ‘మాతృభూమి’గా మార్చారు. అంతేకాకుండా సినిమాలోని 40 శాతానికి పైగా సన్నివేశాలను రీషూట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే నెల 4న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్ ఆర్మీ కమాండర్‌గా కనిపించారు. దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహించడంతో పాటు, కుటుంబ బాధ్యతలను చూసుకునే భర్తగా కూడా ఆయన పాత్రను చూపించారు. దేశభక్తి, సైనికుల త్యాగాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

    HIGHLIGHTS:

    - సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల

    - ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ నుంచి టైటిల్ మార్పు

    - 40 శాతానికి పైగా సన్నివేశాల రీషూట్

    - ఆర్మీ కమాండర్‌గా కనిపించనున్న సల్మాన్

    - ట్రైలర్‌పై మిశ్రమ అభిప్రాయాలు

    సుమారు నాలుగున్నర నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, సైనికుల పోరాటం ప్రధానంగా కనిపించాయి. అయితే ట్రైలర్ ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథాంశం కూడా గతంలో వచ్చిన యుద్ధ నేపథ్య చిత్రాలను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా కథలో కొత్తదనం అంతగా కనిపించకపోవడం కొంత నిరాశ కలిగిస్తోంది.

    ఇప్పటికే వరుస సినిమాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న సల్మాన్ ఖాన్‌కు ‘మాతృభూమి’ కీలకంగా మారింది. మరి ఈ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారు? ట్రైలర్‌తో సాధించలేని ఆసక్తిని సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల్లో కలిగిస్తారా? అనేది చూడాలి.

    Also Read- పెళ్లి మండపంలో ప్రభాస్.. ‘ఫౌజీ’లో కీలక సన్నివేశాల చిత్రీకరణ!