99TV News

    శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ మూవీ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్ | Shraddha Kapoor Eetha Movie Trailer

    శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ మూవీ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్ | Shraddha Kapoor Eetha Movie Trailer

    ప్రసవానంతరం కూడా కాలికి గజ్జెకట్టి ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ‘ఈఠా’ (Eetha). బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.

    డిసెంబరు 4న గ్రాండ్ రిలీజ్

    లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం నిజానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం చివరకు డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

    ట్రైలర్ డేట్‌పై శ్రద్ధా కపూర్ ప్రకటన

    సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో శ్రద్ధా కపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రైలర్ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు. ‘‘ఈ శుక్రవారం అసలు సిసలైన మ్యాజిక్‌ను చూడబోతున్నారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది’’ అనే క్యాప్షన్‌తో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. చీకటిలో కిక్కిరిసిన భారీ జనసమూహం లాంతర్లను పట్టుకుని ఆసక్తిగా నృత్యం కోసం ఎదురుచూస్తున్న ఆ దృశ్యాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ శుక్రవారం రానున్న ట్రైలర్ కోసం శ్రద్ధా అభిమానులు మరియు సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.