జమ్మూకశ్మీర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, శ్రీనగర్‌లో సీజన్ కనిష్ఠం
డిసెంబర్ 3 వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా; రాత్రివేళ చలి మరింత పెరిగే అవకాశం
జమ్మూకశ్మీర్‌లో చలి తీవ్రత పెరుగుతుండగా, బుధవారం శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా మైనస్ 1.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మలమైన రాత్రి ఆకాశం, పొడి వాతావరణం కారణంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పహల్గామ్‌లో మైనస్ 3.6 డిగ్రీలు, గుల్మార్గ్‌లో 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్ములో 9.8, కత్రాలో 10.2, భదర్వాలో 3.2 డిగ్రీలుగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు చెప్పారు.
HIGHLIGHTS
- శ్రీనగర్‌లో మైనస్ 1.9 డిగ్రీలు
- పహల్గామ్‌లో మైనస్ 3.6 డిగ్రీలు
- డిసెంబర్ 3 వరకు పొడి వాతావరణం
- ప్రాథమిక తరగతులకు సెలవులు పరిశీలనలో
వర్షం లేదా మంచు కురిస్తే గాలి నాణ్యత మెరుగుపడొచ్చని పర్యావరణ నిపుణులు తెలిపారు. చలి పెరగడంతో స్థానికులు ఫెరాన్ ధరించడం ప్రారంభించారు. పరిస్థితిని బట్టి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు శీతాకాల సెలవులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. నిత్యావసర సరుకులకు కొరత లేదని, నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు.
