గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్ చేసిన దుండగులు
చండీగఢ్: పంజాబీ సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. బర్నాలా జిల్లా ఫర్వాహి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బైక్పై వచ్చిన నిందితులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో సిద్ధు ఇంట్లో లేకపోగా, కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
