దూసుకొస్తున్న ఆర్నాన్ తుపాన్
అల్పపీడనం బలపడితే తెలుగురాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయా? వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ వాతావరణ మార్పు ఉపశమనాన్ని ఇస్తుందా? ఇప్పటికే సాగు చేసిన పంటలకు ఈ వర్షాలు ఎంతవరకు ఉపయోగపడనున్నాయి? బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్ భూగర్భ జలాలను పెంచే పరిస్థితిని తీసుకొస్తుందా?
బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో నెలకొనే వాతావరణ మార్పులపై వస్తున్న సూచనలు ఓ పక్క తెలుగురాష్ట్రాల ప్రజలు ఊరటకల్పిస్తూనే మరో పక్క భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవును ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత అది తుఫాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఓ పక్క ఇది మంచి విషయమే అయినప్పటికీ.. భారీ వర్షాలు కురిస్తే ఉన్న పంట నాశనం అవ్వొచ్చనే భయాందోళన కూడా నెలకొంది.
అయితే ఈ తుఫాన్ రాకపై ఒక్కో వాతావరణ సంస్థ ఒక్కోలా అంచానా వేస్తోంది. అమెరికన్ మోడల్ వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడనం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారి, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదే సమయంలో యూరోపియన్ మోడల్ వాతావరణ శాఖ మాత్రం ఇది తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ లేదని, కేవలం అల్పపీడనంగా మాత్రమే బలపడి భారీ వర్షాలు కురిపిస్తుందని స్పష్టం చేసింది.
అయితే భారత వాతవారణ శాఖ అంచనా మాత్రం మరోలా ఉంది. ప్రస్తుతం థాయ్‌లాండ్ వైపు నుంచి వచ్చిన ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి బలపడుతుందని పేర్కొంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారి, క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అనేది మాత్రం భాతర వాతావరణ శాఖ స్పష్టం చేయలేదు. కాబట్టి ఇప్పుడే పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు.
అయితే ఈ తుఫాన్ ఏర్పడినా, లేకపోయినా ఈ అల్పపీడనం ప్రభావంతోనైనా రాబోయే రోజుల్లో తెలుగురాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
-----
ముఖ్యంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది కొంత ఆశను కలిగిస్తోంది. ఇప్పటికే పంటలు సాగు చేసిన ప్రాంతాల్లో సరైన సమయంలో వర్షం పడితే నేలలో తేమ పెరుగుతుంది. పంటలకు అవసరమైన నీరు అందడంతో వాటి ఎదుగుదలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు ఈ వర్షాలు మరింత కీలకం కానున్నాయి. వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్న సమయంలో ఒక మంచి వర్షం పడితే సాగులో ఉన్న పంటలకు తక్షణ ఉపశమనం లభించొచ్చు. అంతేకాదు వర్షపు నీటిలో కొంత భాగం భూమిలోకి ఇంకితే భూగర్భ జలాలపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. బావులు, బోర్లు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరితే నీటి లభ్యత పెరగొచ్చు. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాలు కురిస్తే పంటలకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. పొలాల్లో నీరు నిలిచిపోతే కొన్ని పంటలు దెబ్బతినొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు సమస్యలు తలెత్తొచ్చు. అందుకే రైతులకు వర్షం కావాలి కానీ అతివర్షం మాత్రం వద్దనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అల్పపీడన వ్యవస్థ తుఫాన్‌గా మారినా, అల్పపీడనంగానే కొనసాగినా వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడితే తెలుగురాష్ట్రాలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి వనరులపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడంతో వ్యవసాయం, తాగునీటి అవసరాలపై ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం, అది బలపడితే తుఫాన్‌గా మారే అవకాశం ఆశలు రేకెత్తిస్తోంది. ఒకవేళ అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురిస్తే.. కేవలం పంటలకు మాత్రమే కాదు, భవిష్యత్ నీటి అవసరాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు తెలుగురాష్ట్రాల ప్రజల చూపు బంగాళాఖాతం వైపే ఉంది. మొత్తంగా చూస్తే అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మంచి వర్షాలు కురిస్తే.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఉపశమనంతో పాటు భూగర్భ జలాలకు కూడా కొంత జీవం పోసే అవకాశం ఉంటుంది.
