99TV News

    Bihar Blast: ఐదుగురు మృతి | Siwan Firecracker Explosion

    Bihar Blast: ఐదుగురు మృతి | Siwan Firecracker Explosion

    బిహార్‌లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

    బిహార్‌లోని సీవాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్లాంపూర్ గ్రామంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సీవాన్ జిల్లా ఎస్పీ భరత్ సోనీ వెల్లడించారు. వైద్య బృందం అంచనా మేరకు ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు సివిల్ సర్జన్ ధ్రువీకరించారు.

    ప్రమాదం జరిగిన సమయంలో కేంద్రంలో ఏడుగురు నుంచి ఎనిమిది మంది వరకు ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు ఇంటి బయట ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరొకరు చిక్కుకుని ఉండవచ్చని రెస్క్యూ బృందాలు అనుమానిస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

    సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడుకు కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు పరిశీలన చేపట్టాయి. డ్రోన్ల సాయంతోనూ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమ బాణాసంచా తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.