నవంబర్ 1 నుంచి కాలర్ పేరు చూపించడం తప్పనిసరి
అన్ని సెల్యూలర్ నెట్‌వర్క్‌లలో కాలర్ ఐడీ సేవను ఉచితంగా అందించాలని టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి అన్ని టెలికం కంపెనీలు కాలర్ ఐడీ ఫీచర్‌ను తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలని టెలికమ్యూనికేషన్ల విభాగం ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రకారం సెల్యూలర్ నెట్‌వర్క్‌లలో కాల్ చేసిన వ్యక్తి పేరు, కాల్ అందుకునే వారి ఫోన్ స్క్రీన్‌పై కనిపించాలి.
టెలికం కంపెనీలు తమ చందాదారుల ఫోన్ నంబర్లతో లింకైన పేర్ల డాటాబేస్‌ను సిద్ధంగా ఉంచాలి. కాలర్ వివరాలను సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ నుంచి సేకరించి సరైన పేరును ప్రదర్శించాలి. ఈ సేవను వినియోగదారులకు ఉచితంగా అందించాల్సి ఉంటుంది.
HIGHLIGHTS
- అమలు తేదీ నవంబర్ 1
- కాలర్ పేరు ఫోన్ స్క్రీన్‌పై
- సేవ ఉచితంగా అందుబాటులోకి
- విదేశీ కాల్స్‌కు ‘ఇంటర్నేషనల్’ సూచన
విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు ఫోన్ నంబర్ పక్కన ‘ఇంటర్నేషనల్’ అని కనిపిస్తుంది. అయితే కాలింగ్ లైన్ గుర్తింపు నిరోధకత సదుపాయాన్ని ఎంచుకున్న వినియోగదారుల పేర్లు స్క్రీన్‌పై ప్రదర్శించబడవు. నవంబర్ 1 నాటికి అమలు ఏర్పాట్లు పూర్తి చేయాలని కంపెనీలకు సూచించారు.
