జంతర్ మంతర్ నిరసనపై 24 గంటల్లో నిర్ణయం చెప్పాలని ఢిల్లీ పోలీసులకు సీజేపీ గడువు
నిరసన తేదీ, సమయాన్ని పోలీసులే ఖరారు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. నిరసన తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరుతూ, స్పందనకు 24 గంటల గడువు ఇచ్చారు.
పార్టీ కార్యకర్త సౌరవ్ దాస్ మాట్లాడుతూ, “నిరసనకు కనీసం 10 రోజుల ముందే దరఖాస్తు చేయాలని పోలీసులు చెబుతున్నారు. అందుకే తేదీ, సమయాన్ని వారికే అప్పగించాం” అన్నారు. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని ఆయన పేర్కొన్నారు.
HIGHLIGHTS
- జంతర్ మంతర్ వద్ద నిరసనకు సీజేపీ సిద్ధం
- పోలీసులకు 24 గంటల గడువు
- తేదీ, సమయం నిర్ణయం పోలీసులకే అప్పగింత
సీజేపీ నేత అశుతోష్ రంకా మాట్లాడుతూ, “పోలీసుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. స్పందన రాకపోతే 24 గంటల్లో తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అన్నారు. “ఈ వ్యవహారాన్ని నిరవధికంగా పెండింగ్‌లో ఉంచేందుకు అంగీకరించం” అని దాస్ పోలీస్ స్టేషన్ వద్ద చెప్పారు. గడువు ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
