99TV News

    CRPF జవాన్ తొలగింపు: కమాండర్‌కు బెదిరింపు పోస్ట్

    CRPF జవాన్ పినాక్ నాథ్ తొలగింపు.. కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియా పోస్ట్

    సీఆర్‌పీఎఫ్‌ జవాన్ పినాక్ నాథ్ తొలగింపు.. కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియా పోస్ట్

    సోషల్‌ మీడియా బెదిరింపు పోస్ట్‌పై విచారణ తర్వాత తాత్కాలిక సర్వీస్‌ నిబంధనల కింద చర్య తీసుకున్న అధికారులు

    కమాండర్‌ను చంపుతానని సోషల్‌ మీడియాలో సందేశం పెట్టిన ఆరోపణలపై సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పినాక్‌ నాథ్‌ను సర్వీస్‌ నుంచి తొలగించింది. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో 33వ బెటాలియన్‌ ఆల్ఫా కంపెనీలో ప్రొబేషన్‌లో ఉన్న ఆయనపై విచారణ అనంతరం శుక్రవారం చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    అసోంకు చెందిన నాథ్‌ ఇటీవలే దళంలో చేరినట్లు అధికారులు తెలిపారు. కంపెనీ కమాండర్‌ను చంపి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరో దళంలో జవాన్‌ సర్వీస్‌ ఆయుధంతో సీనియర్‌ అధికారి, సహచరులపై దాడి చేసిన ఘటనను ఆ పోస్ట్‌లో ప్రస్తావించినట్లు అధికారులు చెప్పారు.

    HIGHLIGHTS

    - తొలగింపునకు గురైన జవాన్‌ పేరు పినాక్‌ నాథ్‌

    - దోడాలోని 33వ బెటాలియన్‌లో విధులు

    - శుక్రవారం సర్వీస్‌ నుంచి తొలగింపు

    - 1965 తాత్కాలిక సర్వీస్‌ నిబంధనల కింద చర్య

    ఈ అంశంపై బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ విచారణ నిర్వహించారని అధికారులు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ తాత్కాలిక సర్వీస్‌ నిబంధనలు, 1965 కింద నాథ్‌ సర్వీస్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. భద్రతా దళాల్లో క్రమశిక్షణ, కమాండ్‌ వ్యవస్థకు సంబంధించిన అంశాలను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తదుపరి పరిపాలనా ప్రక్రియలు నిబంధనల ప్రకారం కొనసాగనున్నాయి.