99TV News

    డీలిమిటేషన్ ఖర్చు: ఎంపీలు, ఎమ్మెల్యేలు పెరిగితే భారం

    డీలిమిటేషన్‌తో ఖజానాపై ఎంత భారం?.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పెరిగితే ఖర్చెంత?

    భారత రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక మహా ప్రకంపనకు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇప్పుడు యావత్ దేశంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఆ నాలుగు రోజుల్లో సభలో ఏం జరగబోతోంది? ఏ చట్టం రూపుదిద్దుకోబోతోంది? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో లోక్‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచి, ప్రస్తుత 543 నుంచి 815కు చేర్చబోతున్నారన్న సంచలన ప్రతిపాదన తెరపైకి రావడం పెను దుమారానికి దారితీసింది. అయితే, ఈ చారిత్రాత్మక మార్పు వెనుక దాగి ఉన్న అసలు ట్విస్ట్ మరొకటి ఉంది. సభలో సీట్లు పెరగడం అంటే కేవలం ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం మాత్రమే కాదు, దేశ ఖజానాపై పడబోయే ఒక భారీ ఆర్థిక సునామీ. 815 మంది ఎంపీలు, ఆరు వేలకు పైగా ఎమ్మెల్యేలు కొలువుదీరితే ఆ ఖర్చుల భారం వేల కోట్ల రూపాయలను దాటబోతోంది. అసలు ఈ 815 మంది ఎంపీల లెక్కేంటి? కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం వెనుక ఉన్న ఆ ముందుచూపు కథేంటి? సగటు పౌరుడి జేబుపై పడబోయే ఆ అదృశ్య భారం ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

    ----

    దేశ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా? భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద మార్పునకు ఢిల్లీ వేదికగా పావులు కదులుతున్నాయా? నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన వెలువడిన క్షణం నుంచే దేశ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ నాలుగు రోజుల ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సంచలన బిల్లును ప్రవేశపెట్టబోతోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన, అంటే డీలిమిటేషన్ అంశం మరోసారి తెరపైకి రావడం పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలను ఏకంగా 50 శాతం పెంచి, సుమారు 815కు చేర్చే భారీ నమూనా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    --

    అసలు ఈ 815 అనే సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ హాలులో ఏకంగా 888 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేసినప్పుడే, భవిష్యత్తులో ఎంపీల సంఖ్య భారీగా పెరగబోతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపివేసిన నియోజకవర్గాల పునర్విభజన గడువు 2026తో ముగియనుంది. అంటే, దశాబ్దాలుగా వేచి చూస్తున్న ఆ చారిత్రాత్మక ఘట్టానికి ఇప్పుడు తెరలేవబోతోంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే, ప్రస్తుత 543 లేదా 545 స్థానాలకు అదనంగా దాదాపు 270 నుంచి 272 మంది కొత్త ఎంపీలు లోక్‌సభలోకి అడుగుపెడతారు.

    --

    ఈ మార్పు కేవలం ఢిల్లీలోని లోక్‌సభకే పరిమితం కాబోవడం లేదు. దీని ప్రకంపనలు దేశంలోని ప్రతి రాష్ట్ర అసెంబ్లీని తాకబోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు 4,123 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత ఆ సంఖ్య ఏకంగా 6,185 నుంచి 6,186కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే, దేశ రాజకీయ యవనికపైకి కొత్తగా 270 మందికి పైగా ఎంపీలు, సుమారు 2,000 మందికి పైగా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాబోతున్నారు.

    --

    నియోజకవర్గాల పునర్విభజన.. అంటే మన ఊరు, మన నియోజకవర్గం హద్దులు మారే సమయం దగ్గరపడింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో ఆపేసిన నియోజకవర్గాల మార్పు గడువు 2026తో ముగుస్తోంది. ఇప్పుడు లోక్‌సభలో 543 ఉన్న ఎంపీల సంఖ్యను 50 శాతం పెంచి, సుమారు 815కు చేర్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది కూర్చునేలా సీట్లు వేసినప్పుడే, భవిష్యత్తులో ఎంపీలు పెరుగుతారని స్పష్టమైంది.

    ---

    ఇక్కడ ఒక పెద్ద రాజకీయ ట్విస్ట్ ఉంది. జనాభా ఆధారంగా సీట్లు విభజిస్తే, జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి నష్టం జరుగుతుందనే ఆందోళన ఉంది. ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గకుండా, అన్నిచోట్లా 50 శాతం పెంచితే ఆ నష్టం తప్పించవచ్చనేది ఒక ఆలోచనగా కనిపిస్తోంది. దీనివల్ల లోక్‌సభలో సుమారు 270 మంది కొత్త ఎంపీలు వస్తారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల సంఖ్య 4,123 నుంచి దాదాపు 6,186కు పెరిగి, కొత్తగా 2,000 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది.

    --

    అయితే, ఇక్కడే అసలైన ఖర్చుల మెలిక ఉంది. ఎంపీలు పెరిగితే మన పన్నుల సొమ్ముపై భారీ భారం పడుతుంది. ఒక్కో ఎంపీకి నెల జీతం, నియోజకవర్గ, ఆఫీసు ఖర్చులు కలిపి నెలకు 2 లక్షల 86 వేల రూపాయలు అందుతాయి. కొత్తగా వచ్చే 270 మంది ఎంపీలకు వీటి కోసమే ఏడాదికి సుమారు 92 కోట్ల 66 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. సభకు హాజరయ్యే రోజువారీ భత్యం రూపంలో మరో 4 కోట్ల 5 లక్షల రూపాయలు అదనంగా అవుతుంది.

    ఇది ఇంకా మొదలే. కొత్త ఎంపీలకు ఢిల్లీలో 270 ఇళ్లు, వాటి నిర్వహణ, ఆఫీసులు, సిబ్బంది ఖర్చులు తోడవుతాయి. 2026-27 బడ్జెట్‌లో లోక్‌సభ నిర్వహణకే 1,009 కోట్లు కేటాయించారు. ఎంపీలు పెరిగితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. అన్నింటికంటే పెద్ద భారం ఎంపీల అభివృద్ధి నిధులు. ఒక్కో ఎంపీకి ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున, 270 మందికి ఏడాదికి 1,350 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

    మరోవైపు, కొత్తగా వచ్చే 2,000 మంది ఎమ్మెల్యేల జీతాలు, ఆఫీసులు, నిధుల భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుంది. ఒక్కో ఎమ్మెల్యేకు రాష్ట్రాలను బట్టి ఏడాదికి 10 లక్షల 80 వేల నుంచి 41 లక్షల 40 వేల రూపాయల వరకు జీతభత్యాలు అవుతాయి. మొత్తానికి, సీట్లు పెంచితే ప్రజలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది కానీ, ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై ఎలాంటి ట్విస్ట్ చోటుచేసుకుంటుందో వేచి చూడాలి.