బెంగళూరు పబ్ ఘటన.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బదిలీ
బెంగళూరులోని ఓ నైట్‌క్లబ్‌లో పోలీసులతో జరిగిన వివాదానికి సంబంధించి కేసు నమోదైన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బదిలీ అయ్యారు. ఆయనను తక్షణమే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2019 బ్యాచ్‌కు చెందిన మర్మత్.. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అక్టోబర్ 9 రాత్రి బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్ నైట్‌క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ల ప్రవేశంపై తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో మర్మత్, మరికొందరు వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మర్మత్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మర్మత్ స్నేహితుడు అభయ్ ఉదయ్ సింగ్, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు నితీష్, బౌన్సర్ రోషన్ కూడా నిందితులుగా ఉన్నారు. ఘటన అనంతరం మరుసటి ఉదయం వారు క్షమాపణలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
