అడ్వకేట్ నివేదితా సుబ్రమణ్యన్ జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వంచే నియమితులయ్యారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన మిశ్రా కూడా ఈ కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.
నివేదితా సుబ్రమణ్యన్: కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకురాలు. గతంలో ఆమె కేరళ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు.
పదవీ కాలం: జాతీయ మహిళా కమిషన్ చట్టం ప్రకారం, నియమితులైన సభ్యులు 3 సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు (ఏది ముందైతే అది) ఈ పదవిలో కొనసాగుతారు.
దేశంలోని మహిళల హక్కుల పరిరక్షణ, చట్టబద్దమైన రక్షణ కల్పించడం మరియు మహిళా సాధికారతకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ సలహాలు అందజేస్తాయి
