పోస్టుమార్టమ్ రూమ్‌లో మద్యం సేవించిన డాక్టర్ సస్పెండ్
వీడియో వైరల్ కావడంతో పింప్రి-చించ్‌వాడ కార్పొరేషన్ చర్యలు; 15 రోజుల్లో ఛార్జ్‌షీట్ సిద్ధం
మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యశ్వంత్‌రావు చౌహాన్ మెమోరియల్ ఆస్పత్రి పోస్టుమార్టమ్ రూమ్‌లో మద్యం సేవించినట్లు వీడియో బయటపడడంతో డాక్టర్ వైభవ్ అవినాశ్ మాస్కేను విధుల నుంచి సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది.
డెత్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి పోస్టుమార్టమ్ రూమ్‌లో డాక్టర్ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించి వీడియో తీశారు. టేబుల్‌పై ఫుడ్, బాటిళ్లు కనిపించాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు.
HIGHLIGHTS
- యశ్వంత్‌రావు చౌహాన్ మెమోరియల్ ఆస్పత్రిలో ఘటన
- డాక్టర్ వైభవ్ అవినాశ్ మాస్కే సస్పెండ్
- 15 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు
అదనపు కమిషనర్ కుల్దీప్ జంగమ్ డాక్టర్‌కు నోటీసు జారీ చేసి రాతపూర్వక వివరణ కోరారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్యవంశీ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. వివరణ, దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
