రాహుల్, ప్రియాంకపై దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు
అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించారన్న ఫిర్యాదుపై కాంగ్రెస్ నేతలు, పలువురు ఎంపీలపై కేసు
కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు ఎంపీలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి నేతలు చేపట్టిన ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పోలీస్ అధికారులు తెలిపారు.
పోలీసులు ర్యాలీని అడ్డుకున్న తర్వాత నేతలు ఆకాశవాణి భవన్ వద్దకు వెళ్లి కొన్ని గంటల పాటు ధర్నా చేశారు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారన్న ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైందని అధికారులు చెప్పారు. తదుపరి విచారణలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
