99TV News

    రాహుల్ గాంధీ అరెస్ట్: Delhiలో ఇండియా కూటమి నిరసన

    రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో 2వ రోజు హై టెన్షన్

    ఢిల్లీ: ఎన్నికల సంఘం వ్యవహారంపై నిరసనగా ఇండియా కూటమి నేతల ఆందోళన రెండో రోజు ఉద్రిక్తంగా మారింది.సాగర్ రత్న హోటల్ నుంచి జన్‌పథ్ రోడ్డు మీదుగా బస్సులో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకోవడం తో జంతర్ మంతర్ రోడ్ పై ధర్నాకు దిగారు అక్కడ పర్మిషన్ లేదంటూ పోలీసులు చెప్పడం తో ప్రియాంక గాంధీ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, విపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ విపక్ష నేతలు నినాదాలు చేశారు. తమ నిరసనను అడ్డుకోవడంపై పోలీసుల చర్యను తప్పుబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.