రహదారులపై ఎలక్ట్రానిక్ నిఘా ఎందుకు లేదు: ఎన్‌హెచ్‌ఏఐని సుప్రీంకోర్టు ప్రశ్న
పార్క్ చేసిన వాహనాల ప్రమాదాలపై ధర్మాసనం ఆందోళన; ఆక్రమణల పిటిషన్లపై 13న విచారణ
రహదారులపై నిలిపిన వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు ఎందుకు ఏర్పాటు చేయడంలేదని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎ.జి.మసీహ్, జస్టిస్ సందీప్‌మెహతాల ధర్మాసనం, వనరులు ఉన్నా జాప్యం ఎందుకని ఆరా తీసింది.
రాజస్థాన్‌లో గత నవంబరులో 15 మంది మృతికి కారణమైన ఘటనపై సుమోటో విచారణలో ఈ అంశం వచ్చింది. అమికస్ క్యూరీ ఎ.ఎన్.ఎస్.నాదకర్ణి ఇటువంటి ప్రమాదాలు ఇటీవలి కాలంలో పెరిగాయని తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది రహదారులపై పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్పారు. ఆక్రమణల తొలగింపుపై పిటిషన్లను ఈ నెల 13న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
