దిల్లీలో మారుతున్న సమీకరణాలు; కేంద్ర క్యాబినెట్‌లోకి సుప్రియా సూలే పేరు చర్చలో
డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా రిజర్వేషన్లపై ఎన్‌సీపీ ఎస్‌పీ వైఖరి ఎన్‌డీఏకు కీలకంగా మారుతోంది
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సమీపిస్తున్న వేళ దిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎన్‌సీపీ శరద్‌పవార్ పక్షం మద్దతు ఇవ్వొచ్చన్న సంకేతాల మధ్య సుప్రియా సూలే పేరు కేంద్ర క్యాబినెట్ చర్చల్లోకి వచ్చింది.
ఎన్‌సీపీ ఎస్‌పీ వర్గం కేంద్ర, మహారాష్ట్ర స్థాయిల్లో కీలక పదవులపై సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సుప్రియా సూలే ఇటీవల ఇండియా కూటమి చేపట్టిన ఎస్‌ఐఆర్ వ్యతిరేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే డీలిమిటేషన్ బిల్లుపై “కాపీ మొత్తాన్ని పరిశీలించిన తర్వాతే మా వైఖరి చెబుతాం” అని సుప్రియా సూలే ఇటీవల దిల్లీలో అన్నారు.
HIGHLIGHTS
- ఎన్‌సీపీ ఎస్‌పీకి 8 మంది ఎంపీలు
- సుప్రియా సూలే పేరు క్యాబినెట్ చర్చల్లోకి
- డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి ఇంకా స్పష్టం కాలేదు
మహారాష్ట్రలో ఆర్థిక శాఖ సహా 2 కీలక పోర్టుఫోలియోలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒక శాఖకు జయంత్ పాటిల్ పేరు వినిపిస్తోంది. “ఇండియా కూటమి సమావేశానికి తండ్రి అనారోగ్యం కారణంగా హాజరుకాలేను” అని సుప్రియా సూలే తెలిపారు. ఆమె సోమవారం దిల్లీకి వెళ్లి పార్లమెంట్ చర్చలో పాల్గొననున్నారు. తుది నిర్ణయం ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే స్పష్టమవనుంది.
