ఆధార్లో పేరు మార్పుకు కొత్త పత్రాల నిబంధనలు అమలు
మైనర్, మేజర్ మార్పులను వేరు చేసిన యూఐడీఏఐ; గెజిట్, అఫిడవిట్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఆధార్ కార్డులో పేరు మార్పులు, సవరణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఎస్ఓపీని అమల్లోకి తెచ్చింది. 2021 నిబంధనల స్థానంలో వచ్చిన మార్గదర్శకాలు చిన్న అక్షరదోషాలు, వివాహం, విడాకులు, పూర్తి పేరు మార్పులను వేర్వేరుగా నిర్వచించాయి.
డాట్స్ తొలగింపు, ఇనీషియల్స్ విస్తరణ, చిన్న స్పెల్లింగ్ సవరణలకు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం సరిపోతుందని యూఐడీఏఐ పేర్కొంది. వివాహం లేదా విడాకుల తర్వాత ఇంటిపేరు మార్పుకు అనెక్సర్ డి అఫిడవిట్ అవసరం. డేటా ఎంట్రీ తప్పిదాలకు పెద్దలు అనెక్సర్ బి, మైనర్లు అనెక్సర్ సి సమర్పించాలి.
HIGHLIGHTS
- కొత్త ఎస్ఓపీ ఇప్పటికే అమల్లోకి
- పూర్తి పేరు మార్పుకు గెజిట్ తప్పనిసరి
- ఆధార్ సేవా కేంద్రంలో రూ.75 రుసుము
- బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాతే అప్డేట్
పూర్తి పేరు మార్పును మేజర్ నేమ్ ఛేంజ్గా పరిగణించి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్, గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేసింది. లింగ మార్పిడి, చిన్నారుల పేర్ల మార్పులకూ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు సమీప ఆధార్ సేవా కేంద్రంలో పత్రాలు సమర్పించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి రూ.75 చెల్లించాలి.
