99TV News

    వందే భారత్ రైలు అలర్ట్: Automatic Doors నిబంధనలు

    వందే భారత్ రైలు ఎక్కేముందు తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

    వందే భారత్‌లో ప్లాట్‌ఫారమ్ టికెట్‌తో ఎక్కితే చర్యలు

    కాన్పూర్ ఘటన తర్వాత ఆటోమేటిక్ డోర్లపై రైల్వే హెచ్చరికలు; 12 మందికి రూ.36,140 జరిమానా

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వీడ్కోలు చెప్పడానికి లేదా లగేజీ సర్దేందుకు బోగీల్లోకి ఎక్కరాదని రైల్వే అధికారులు హెచ్చరించారు. కాన్పూర్ సెంట్రల్‌లో నవంబర్ 15న బెనారస్-న్యూఢిల్లీ రైలులో ఎక్కిన 12 మంది ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో ఇటావా వరకు వెళ్లాల్సి వచ్చి, రూ.36,140 జరిమానా చెల్లించారు.

    వందే భారత్ రైళ్లలో డోర్లు బయలుదేరే ముందు స్వయంగా మూసుకుపోతాయని, తదుపరి స్టేషన్ వరకు తెరుచుకోవని అధికారులు చెప్పారు. ప్లాట్‌ఫారమ్ టికెట్ రైలు లోపలికి అనుమతి కాదని స్పష్టం చేశారు. ప్రయాణ టికెట్ ఉన్నవారే బోగీల్లోకి ప్రవేశించాలని, లగేజీ కోసం అధీకృత కూలీల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర కారణం లేకుండా చైన్ లాగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే తెలిపింది.

    Also Read - ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో బెంగాల్ కరువు ప్రస్తావన: ఘర్షణల భారం అందరిపై ఒకేలా ఉండదన్న భారత్