99TV News

    కేటీఆర్ డిమాండ్: CEC జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి

    రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. CEC జ్ఞానేష్ కుమార్ వైదొలగాలి: కేటీఆర్

    జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్

    ఓటు హక్కు రాజ్యాంగబద్ధమని, ఎవరూ దాన్ని లాక్కోలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు

    భారత రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలపై స్పందిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.

    “భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదు,” అని కేటీఆర్ అన్నారు. “ఈ దేశంలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కునూ లాక్కునే అధికారం ఎవరికి లేదు,” అని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థల కంటే వ్యక్తులు గొప్పవారు కాదని చెబుతూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను సహించరాదన్నారు.

    HIGHLIGHTS

    - కేటీఆర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరారు

    - ఓటు హక్కు లాక్కోలేరని వ్యాఖ్య

    - సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్

    “140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హక్కుల కంటే ఒక వ్యక్తి ఎలా గొప్పవాడు,” అని కేటీఆర్ ప్రశ్నించారు. “వ్యవస్థలను పక్కనపెట్టి ఒక వ్యక్తిని కాపాడటానికి తాపత్రయం ఎందుకు,” అని ఆయన అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరపాలని బీఆర్‌ఎస్ తరఫున ఆయన కోరారు.