99TV News

    సత్యకుమార్ యాదవ్‌కు BJP సేవా సంకల్ప్ బాధ్యతలు

    మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు BJP కీలక బాధ్యతలు

    మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు బీజేపీ దక్షిణాది బాధ్యతలు

    ‘సేవా సంకల్ప్ అభియాన్’కు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా వైద్యారోగ్య శాఖ మంత్రి నియామకం

    ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని బీజేపీ చేపడుతున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం సెప్టెంబర్ 2న నియమించింది.

    సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ అభియాన్‌లో బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కార్యక్రమాల సమన్వయం, అమలు, పర్యవేక్షణ బాధ్యతలను సత్యకుమార్‌ యాదవ్‌ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

    HIGHLIGHTS

    - సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు అభియాన్

    - దక్షిణాది ఇన్‌ఛార్జిగా సత్యకుమార్‌ యాదవ్‌

    - మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా కార్యక్రమాలు

    - తిరుచిరాపల్లిలో రాష్ట్రవ్యాప్త కార్యశాల

    ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను అభియాన్‌లో భాగంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రజాసేవ, దేశాభివృద్ధి, ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయడమే ఉద్దేశమని పార్టీ నేతలు చెప్పారు.

    తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరగనున్న రాష్ట్రవ్యాప్త కార్యశాలలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొననున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కార్యాచరణపై చర్చించి, అభియాన్‌ అమలుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.