అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల ధ్రువీకరణ ప్రారంభం
నవంబర్ 25 నుంచి కరీంనగర్ సీటీసీలో జగిత్యాల జిల్లా బాధితులకు ప్రత్యేక కేంద్రం పని చేయనుంది
అగ్రిగోల్డ్ బాధితుల అసలు బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ నవంబర్ 25 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. జగిత్యాల జిల్లా బాధితుల కోసం కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మండలాల వారీగా పరిశీలన జరుగుతుందని, రోజుకు గరిష్ఠంగా 250 ఖాతాలు చూస్తారని ఎస్పీ తెలిపారు. అసలు బాండ్ లేదా రసీదు, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫొటో, మొబైల్ నంబరు తీసుకురావాలని సూచించారు. “అసలు బాండ్లు పరిశీలనకే చూపాలి, అప్పగించాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
HIGHLIGHTS
- నవంబర్ 25 నుంచి ధ్రువీకరణ
- కరీంనగర్ సీటీసీలో ప్రత్యేక కేంద్రం
- రోజుకు గరిష్ఠంగా 250 ఖాతాలు
డిపాజిటర్ మరణించినా, రాలేని పరిస్థితి ఉన్నా నామినీ లేదా కుటుంబ సభ్యులు అవసరమైన ధ్రువపత్రాలతో రావాలని ఎస్పీ తెలిపారు. సమీప పోలీస్‌స్టేషన్‌లో ముందుగా సమాచారం ఇస్తే కేంద్రానికి వెళ్లేందుకు సహకారం అందిస్తామని చెప్పారు.
