99TV News

    లంచం తీసుకుంటూ దొరికిన బంజారాహిల్స్ ఎస్సై: ఏసీబీ సోదాలు | Banjara Hills SI Caught by ACB

    లంచం తీసుకుంటూ దొరికిన బంజారాహిల్స్ ఎస్సై: ఏసీబీ సోదాలు | Banjara Hills SI Caught by ACB

    హైదరాబాద్:

    హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒక బాధితుడి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

    రూ. 10 లక్షలు డిమాండ్.. రూ. లక్ష తీసుకుంటూ దొరికిపోయిన వైనం

    పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఒక వ్యవహారంలో బాధితుడికి సహకరించేందుకు ఎస్సై విజయ్ ఏకంగా రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై విజయ్‌కు రూ. లక్ష లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను పట్టుకున్నారు.

    Also Read - మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్.. వేకువజాము నుంచే పోలీసుల మోహరింపు!

    తీవ్రంగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు

    లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఎస్సై విజయ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తూ, సంబంధించిన కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తదుపరి విచారణ జరుపుతున్నారు. పీఎస్ పరిధిలో ఎస్సై స్థాయి అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోవడం స్థానికంగా కలకలం రేపింది.