బుగ్గారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం, నాణ్యత పెంచాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశాలు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని బుగ్గారం పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఐపీఎస్ తనిఖీ చేశారు. పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసుల కేసు డైరీ ఫైళ్లను ఎస్పీ పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం ఉండాలని, ప్రజలకు సైబర్ నేరాలు, సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
HIGHLIGHTS
- బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ తనిఖీ
- పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష
- సైబర్ నేరాలపై అవగాహనకు ఆదేశం
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించాలని, విజిబుల్ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కానిస్టేబుళ్లు తమ పరిధి గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించాలని ఆదేశించారు. తనిఖీలో ఎస్‌ఐ కృష్ణసాగర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
