చండూర్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
లో-వోల్టేజీ, ట్రిప్పింగ్‌తో మోటార్లు కాలుతున్నాయని ఆవేదన; రోజుకు 9 నుంచి 12 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, లో-వోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వరి పంటలు చివరి దశలో ఉన్న సమయంలో సరఫరా సక్రమంగా లేక సాగునీరు అందించలేకపోతున్నామని రైతులు తెలిపారు.
కొంతకాలంగా తరచూ ట్రిప్పింగ్ జరుగుతోందని, దీనివల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని వారు చెప్పారు. సమస్యను ఏఈ, ఏఈడీల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు.
HIGHLIGHTS
- చండూర్ సబ్‌స్టేషన్ వద్ద రైతుల ముట్టడి
- 9 నుంచి 12 గంటల విద్యుత్ డిమాండ్
- లో-వోల్టేజీతో మోటార్లు దెబ్బతింటున్నాయని ఆరోపణ
పంటలకు నష్టం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
