హైదరాబాద్:
తీవ్ర రూపం దాలుస్తున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ముందుస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని శంషాబాద్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ) విమానాశ్రయం నుంచి నడిచే పలు సర్వీసులను అధికారులు బుధవారం రద్దు చేశారు.
33 విమాన సర్వీసులు రద్దు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మొత్తం 33 విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన 17 విమానాలు రద్దయ్యాయి.
Also Read - బంజారాహిల్స్ పిఎస్‌లో ఏసీబీ సోదాలు: లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత విమానాశ్రయాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 16 విమానాలు రద్దయ్యాయి.
ఏపీ నగరాలకు నిలిచిన సర్వీసులు
రద్దయిన విమానాల్లో ప్రధానంగా శంషాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాలకు వెళ్లాల్సిన సర్వీసులు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సంబంధిత విమానయాన సంస్థలు ముందస్తు సమాచారం అందిస్తున్నాయని, వాతావరణ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ సర్వీసుల స్థితిని (Flight Status) ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించారు.
