హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
దసరా సెలవుల తర్వాత తిరుగు ప్రయాణాలతో వాహనాల రద్దీ; చౌటుప్పల్ పనులతో నెమ్మదించిన రాకపోకలు
దసరా సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రయాణికులతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల అధిక రద్దీ కారణంగా రాకపోకలు నెమ్మదించాయి.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‌లు తెరిచినట్టు అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా గత 10 రోజుల్లో ఈ మార్గంలో 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయని వారు చెప్పారు. “రద్దీని తగ్గించేందుకు అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నాం,” అని ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. “గంటల తరబడి నిలిచిపోయాం,” అని ఓ వాహనదారు చెప్పారు.
HIGHLIGHTS
- హైదరాబాద్ వైపు వాహనాల భారీ రద్దీ
- పంతంగి వద్ద 10 టోల్ బూత్‌లు ఓపెన్
- 10 రోజుల్లో 7 లక్షల వాహనాలు
- చౌటుప్పల్ పనులతో ట్రాఫిక్ నెమ్మది
ఇక ట్యాంక్‌బండ్ పరిసరాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనంతో అదనపు రద్దీ నెలకొంది. ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. “ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం కొనసాగుతోంది,” అని పోలీసులు తెలిపారు. రాత్రి వరకు రద్దీ కొనసాగొచ్చని అధికారులు అంచనా వేశారు.
