99TV News

    జగిత్యాలలో విషాదం.. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

    జగిత్యాలలో విషాదం.. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

    జగిత్యాల జిల్లాలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

    జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఆనంద్ బాబు (23), సంజీవ్ (22)గా గుర్తించారు.

    భవన నిర్మాణ పనుల కోసం ఈ వారంలోనే వీరు చింతకుంట గ్రామానికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం రాత్రి పని ముగించుకున్న అనంతరం గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద మద్యం సేవిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై రవికిరణ్ అక్కడ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. యువకుల మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.