99TV News

    KTR Beard Look: Reason Behind His Ramagundam Visit Appearance

    KTR Beard Look: Reason Behind His Ramagundam Visit Appearance

    గడ్డంతో కేటీఆర్‌ కొత్త లుక్‌.. కారణం ఇదేనంటూ సరదా వ్యాఖ్య

    హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కొత్త లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్లీన్‌ షేవ్‌తో కనిపించే ఆయన ఈసారి గడ్డంతో దర్శనమివ్వడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. ఆయన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    రామగుండంలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో పాల్గొనేందుకు కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన సమయంలో ఈ కొత్త లుక్‌లో కనిపించారు. మార్గమధ్యంలో కరీంనగర్‌ వద్ద మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, ఇతర నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా గడ్డం ఎందుకు పెంచారని గంగుల ప్రశ్నించగా కేటీఆర్‌ సరదాగా సమాధానమిచ్చారు.

    ‘పోయేది గోదావరిఖనికే కదా.. సింగరేణికే కదా! ఆ మాత్రం ఉండాలి.. లేకపోతే నడవదు’ అంటూ చమత్కరించారు. సింగరేణి ప్రాంత పర్యటనకు అనుగుణంగానే ఈ లుక్‌లో సిద్ధమైనట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.

    కేటీఆర్‌ కొత్త గడ్డం లుక్‌ను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ప్రశంసిస్తున్నారు. ఆయన సరదా వ్యాఖ్యలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.