99TV News

    మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ వార్షిక తనిఖీ

    మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను కాటారం డీఎస్పీ వార్షిక తనిఖీ చేశారు

    మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన కాటారం డీఎస్పీ

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసులు, కేసు డైరీలను పరిశీలించారు.

    అనంతరం పోలీస్ సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలపై సమీక్షించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

    ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాంబమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.