నల్లమలలో 19 చెంచు పెంటలకు తాగునీటి భరోసా
బోర్లు, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులతో ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన అధికారులు
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని 19 చెంచు పెంటలకు నిరంతర తాగునీరు అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా శుక్రవారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
బోర్లు, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులను తక్షణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సలోని చాబ్రా తెలిపారు. “చెంచు పెంటల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యం,” అని అచ్చంపేటలో నిర్వహించిన సమీక్షలో ఆమె చెప్పారు. అవసరమైన చోట వాటర్ ట్యాంకుల ద్వారా 10 లీటర్ల డబ్బాలతో ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు వివరించారు.
Also Read- కల్వకోల్ గ్రామ సమస్యకు పరిష్కారం.. రూ.80 లక్షలతో మురుగునీటి కాలువకు అనుమతులు
HIGHLIGHTS
- 19 చెంచు పెంటలకు ప్రత్యేక కార్యాచరణ
- ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక
- 10 లీటర్ల డబ్బాలతో నీటి సరఫరా
- బోర్లు, మోటార్లు, పైపులైన్లకు మరమ్మతులు
“ఏ పెంటలోనూ తాగునీటి సరఫరా నిలిచిపోకుండా పర్యవేక్షణ ఉంటుంది,” అని సబ్ కలెక్టర్ చెప్పారు. “ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించాం,” అని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ఫీల్డ్ స్థాయి పరిశీలనల ఆధారంగా అదనపు చర్యలు తీసుకోనున్నారు.
