నర్సంపేట అయ్యప్ప ఆలయంలో రెండో రోజుకు మండల పూజలు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తొలి పడిపూజ వైభవంగా నిర్వహణ
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో 26వ షడ్వింశతి మండల పూజ మహోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
మండల పూజల్లో భాగంగా ఈ నెల 17న నర్సంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తొలి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జర్నలిస్టుల బృందం అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు, పంబా అరాట్టు నిర్వహించింది. పుష్పాభిషేకం భక్తులను ఆకట్టుకుంది.
Also Read- కేటీఆర్ ఆదేశాలతో నర్సంపేటలో పంబా ఆరాట్ మహా అన్నదానం
HIGHLIGHTS
- 26వ షడ్వింశతి మండల పూజలు కొనసాగింపు
- ఈ నెల 17న తొలి పడిపూజ
- జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పదునెట్టంబడపై కర్పూరహారతుల మధ్య అయ్యప్పస్వామి జ్యోతి స్వరూపుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. రాబోయే రోజుల్లో మండల పూజల కార్యక్రమాలు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
