సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పార్టీ నేతలు స్పష్టం చేశారు
భారత రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
లిబర్టీ సర్కిల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి సందీప్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.
HIGHLIGHTS
- హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షక్ మార్చ్
- సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
- లిబర్టీ సర్కిల్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ
ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మహిళా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు సంఘీభావం తెలిపినట్లు మహిళా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్టీ తదుపరి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కొనసాగించనున్నారు.
