99TV News

    గుడుంబా స్థావరాలపై దాడులు.. 6 మందిపై కేసులు

    తాడిచర్ల అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీపై పోలీస్ దాడులు

    గుడుంబా స్థావరాలపై దాడులు; ఆరుగురిపై కేసులు

    41 లీటర్ల గుడుంబా స్వాధీనం, 700 లీటర్ల పానకం ధ్వంసం చేసిన కొయ్యూరు పోలీసులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల కాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీపై సమాచారం అందడంతో కొయ్యూరు పోలీసులు బుధవారం ఉదయం తనిఖీలు చేసి, ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిచర్లకు చెందిన అనుముల హరీష్, చిగురు క్రాంతికుమార్, బోనగిరి రాజయ్య, జోడు రవి, దుల్క చిన్న మల్లయ్య, బోనగిరి ఓదెలును గుర్తించారు. వారి నుంచి 41 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి ఉపయోగించే సుమారు 700 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు.

    HIGHLIGHTS

    - ఆరుగురిపై కేసులు నమోదు

    - 41 లీటర్ల గుడుంబా స్వాధీనం

    - 700 లీటర్ల పానకం ధ్వంసం

    - ఒక్కొక్కరికి రూ.3 లక్షల బైండోవర్

    Also Read- డైలీ కరెంట్ అఫైర్స్ 17 నవంబర్ 2026: పరీక్షలకు ముఖ్యమైన 20 అంశాలు

    అనంతరం ఆరుగురిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి, తిరిగి గుడుంబా తయారీలో పాల్గొనకుండా ఒక్కొక్కరిని రూ.3 లక్షలకు బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మళ్లీ గుడుంబా తయారీకి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని, అవసరమైతే వారిపై షీట్లు ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.