2047 నాటికి తెలంగాణకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుత 5 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
CURE, PURE, RARE వ్యూహాల ద్వారా హైదరాబాద్‌లో సేవారంగం, నగర పరిసరాల్లో తయారీ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని వ్యాఖ్యానించారు.
