99TV News

    Telangana Census 2027: జనవరి 10 నుంచి స్వీయగణన, 25 నుంచి ఇంటింటికీ సర్వే

    Telangana Census 2027: జనవరి 10 నుంచి స్వీయగణన, 25 నుంచి ఇంటింటికీ సర్వే

    తెలంగాణలో జనగణన-2027 రెండో విడత నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలకు స్వీయగణన (Self-Enumeration) చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది.

    జనవరి 10 నుంచి స్వీయగణన

    జనగణన రెండో విడతలో భాగంగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. జనవరి 10 నుంచి 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం అధికారిక స్వీయగణన పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. వివరాలు విజయవంతంగా నమోదు చేసిన తర్వాత ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ (SE ID) జనరేట్ అవుతుంది. ఇంటింటికీ వచ్చే జనగణన అధికారులకు ఈ ఐడీని తెలియజేయాల్సి ఉంటుంది.

    HIGHLIGHTS

    - తెలంగాణలో జనగణన-2027 రెండో విడతకు షెడ్యూల్ ఖరారు.

    - జనవరి 10 నుంచి 24 వరకు స్వీయగణనకు అవకాశం.

    - జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికీ జనాభా లెక్కలు.

    - మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్.

    - 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీ.

    జనవరి 25 నుంచి ఇంటింటికీ జనగణన

    స్వీయగణన గడువు ముగిసిన తర్వాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత, జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య, వలస తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో డిజిటల్ విధానాన్ని వినియోగించనున్నారు.

    మార్చి 1 నుంచి రివిజనల్ రౌండ్

    జనాభా వివరాల సేకరణ పూర్తయిన తర్వాత మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో సేకరించిన వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపడతారు. జనగణనకు సంబంధించి 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా నిర్ణయించారు.

    Also Read- రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్.. తీవ్రంగా స్పందించిన రాంచందర్ రావు