విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ వినతి
కాటారం డివిజన్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఆపరేషన్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్-82 నాయకులు బుధవారం డివిజన్ ఇంజనీర్ డి. నాగరాజును కోరారు.
యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నాగుల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. 2022 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న పెయిడ్ ఫెస్టివల్ హాలిడేస్ బిల్లులను మంజూరు చేయాలని, స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం 8 గంటల పని విధానం అమలు చేయాలని వారు కోరారు.
Also Read- యోగి కంచుకోటలో ఆసక్తికర దృశ్యం: అఖిలేష్ యాదవ్‌కు బుల్డోజర్లతో ఘన స్వాగతం!
HIGHLIGHTS
- కాటారం ఆపరేషన్ డివిజన్లో వినతి
- 2022 నుంచి 2025 బిల్లులు పెండింగ్
- 8 గంటల పని విధానం డిమాండ్
అదనపు పని చేసినందుకు పరిశ్రమల చట్టం ప్రకారం ఓవర్‌టైమ్ చెల్లించాలని, ఆర్టిజన్ ఉద్యోగులపై అదనపు పని భారం తగ్గించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్ర సతీష్ కుమార్, చిలువే శ్రీధర్, కడారి ధనుష్, రఘునందన్ పాల్గొన్నారు. వినతిని పరిశీలిస్తామని అధికారులు తెలిపినట్లు యూనియన్ నాయకులు చెప్పారు.
